Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ యువత వీరంగం!

  • జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్డు నంబరు 45లో తనిఖీలు
  • పోలీసులు, మీడియా పట్ల దురుసుగా వ్యవహరించిన యువకులు
  • ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు యత్నించిన మహిళ
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ యువత వీరంగం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్డు నంబరు 45లో నిన్న రాత్రి తనిఖీలు చేపట్టారు. పట్టుబడ్డ కొందరు యువకులు పోలీసుల పట్ల, ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా పట్ల దురుసుగా వ్యవహరించడమే కాకుండా దాడి చేసేందుకు యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు యువకులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సహకరించకపోగా, ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు యత్నించింది. అయితే, ఆమెను అడ్డగించిన పోలీసులు, ఆమె కారును సీజ్ చేశారు. తనిఖీల్లో భాగంగా ఎనిమిది కార్లు, ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
Hyderabad
jublie check-post

More Telugu News